మైనర్ బాలలను పనిలో పెట్టుకున్న ఇటుక బట్టీల యజమానులపై కేసులు నమోదు.
సూర్యాపేట జిల్లా, జనవరి 5 (సోమవారం)
R9TELUGUNEWS.COM
సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మైనర్ బాలల అక్రమ ఉపాధిపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ తులసిరాం (కోదాడ), చైల్డ్ ప్రొటెక్షన్ టీం అధికారులు మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఉదయం 11 గంటల సమయంలో హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలోని ఇటుక బట్టీలను పరిశీలించారు.
పరిశీలనలో భాగంగా చిలుకూరి నాగ సైదులు నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో ఒక మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నట్లు గుర్తించారు. అలాగే అదే గ్రామానికి చెందిన చిలుకూరి సాయి నిర్వహిస్తున్న మరో ఇటుక బట్టీలో కూడా మైనర్ బాలలను పనిలో పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయగా, రెండు ఇటుక బట్టీల యజమానులైన చిలుకూరి నాగ సైదులు, చిలుకూరి సాయిలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా హుజూర్నగర్ ఎస్ఐ బండి మోహన్ బాబు మాట్లాడుతూ,
మైనర్ బాలలను ఏ రూపంలోనైనా పనిలో పెట్టుకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.