ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల భద్రతకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఉద్యోగులందరికీ కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తామంది. ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కోటి రూపాయల ఇన్సూరెన్స్ గురించి కీలక ప్రకటన చేశారు.

కోటి రూపాయల బీమా…!

కష్టపడే వారికి ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి కార్మికులతో పాటు విద్యుత్తు కార్మికులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులందరకీ కోటి రూపాయల బీమా పథకాన్ని వర్తింప చేస్తామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు సంక్షేమం విషయంలో ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959