మిత్రుని కుటుంబానికి 15,000  రూపాయలు మరియు 50 కేజీల బియ్యం అందజేత..!

మిత్రుని కుటుంబానికి 15,000  రూపాయలు మరియు 50 కేజీల బియ్యం అందజేత..!

ఇటీవల పరమపదించిన
(15-12-2025)  బైరo.వెంకయ్య కుటుంబానికి చైతన్య భారతి డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు (  2001-04 బ్యాచ్ )  15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందజేయడం జరిగింది.
అదేవిధంగా   ఓపెన్ ఐస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 50 kg ల  బియ్యాన్ని అందజేశారు.దీంతోపాటు సొసైటీ తరఫున ప్రతినెల 1500 రూపాయలు పెన్షన్ రూపంలో  2  సంవత్సరాల వరకు ఇస్తామని ప్రధాన కార్యదర్శి సులువ. శ్రీను తెలిపారు
వారి పెద్ద కూతురు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం, చిన్న కూతురు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నారు.వెంకయ్య పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఒక సిమెంట్ ఫ్యాక్టరీ స్కూల్లో ప్రైవేటు టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు.
ఇప్పుడు ఆదాయాన్ని ఆర్జించే కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నది.ఇప్పటికిప్పుడే  వితంతు పెన్షన్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో  ఈ సహాయం చేసినట్లు తెలిపారు.
పట్టణంలోని ప్రముఖులు, దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఆర్థిక సహాయం చేసిన మిత్రులు మోతిలాల్, స్వప్న, శ్రీను, పావని, నవీంద్ర, శంకర్, హరిత ఉన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సులువ శ్రీను, బానోతు మోతిలాల్ , సులువ చంద్రశేఖర్ ,  DSR ట్రస్ట్ దగ్గుపాటి బాబురావు,   తిలక్ నగర్ కు చెందిన  దయాకర్,కుడితొట్టి  ఇర్మియ,
మామిడి ఇమ్మానియేల్,  కోల్లపూడి ఏసురత్నం, కోల్లపూడి కళ్యాణ్ , ఏసు,  సోమ గాని సుజాత,  కృష్ణ , ఐల శీను తదితరులు పాల్గొన్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959