హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు లేని మానవత్వం, వీధి కుక్కల విషయంలోనే ఎందుకు బయటకు వస్తోంది…రేణు దేశాయ్.

వీధి కుక్కల సంరక్షణ గురించి రేణు దేశాయ్ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్కల వల్ల మనుషులు చనిపోతున్నారని వాదించేవారు, ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలల్లో చనిపోతున్న లక్షలాది మంది ప్రాణాల గురించి ఎందుకు మాట్లాడరని ఆమె ప్రశ్నించారు. కేవలం కుక్కలపై ఉన్న కోపంతోనే మనుషుల ప్రాణాల గురించి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు లేని మానవత్వం, వీధి కుక్కల విషయంలోనే ఎందుకు బయటకు వస్తోందని ఆమె నిలదీశారు. తాను మూగజీవుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు..

ఇటీవల కొన్ని ఏరియాలలో వీధి కుక్కలను చంపినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రీట్ డాగ్స్ కారణంగా మనుషులు చచ్చిపోతున్నారని మాట్లాడేవారు.. యాక్సిడెంట్స్ వల్ల నిత్యం లక్షల మంది చనిపోతున్నారని, దాని గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ”వీధి కుక్కల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని సెప్టెంబర్ లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కుక్కలు కరవడం వల్ల చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, రేబిస్ వ్యాధి వస్తోందని, రోడ్లపై బైకులపై ప్రయాణిస్తున్న వారిని వెంబడించడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయని అంటున్నారు. మనుషుల ప్రాణాల గురించి మాట్లాడేవారు.. మీకు నిజంగా మనుషుల మీద అంత కరుణ, దయ ఉంటే.. రోజూ యాక్సిడెంట్స్ వల్ల లక్షలమంది చనిపోతున్నారు. ఆ ప్రాణాలకు విలువ లేదా?. దోమకాటు వల్ల ఏడాదికి ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఆ ప్రాణాలకు విలువ లేదా?” అని రేణు దేశాయ్ ప్రశ్నించారు…

మీడియా ప్రతినిధిపై ఆగ్రహం.. క్లారిటీ...

Renu Desai Clarifies: Not Joining Any Political Party, Slams …

వీధి కుక్కలను చంపడంపై నటి రేణూ దేశాయ్‌, యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. కుక్కల కారణంగా మనుషుల ప్రాణాలు పోతాయని అంటున్నారని, ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారని, వాళ్ల ప్రాణాలంటే లెక్కలేదా? అని రేణు ప్రశ్నించారు. ఒక కుక్క కరుస్తోందని వందల కుక్కలను చంపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధిపై రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు…