కేంద్ర మంత్రికి కేటీఆర్‌ లేఖ..

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ (Sircilla Mega Power Loom) క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం , వివక్షాపూరిత వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె. తారక రామారావు ( KTR ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ ( Letter ) రాశారు…
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, గత పదేళ్లుగా తాము నిరంతరాయంగా పోరాడుతున్నామని గుర్తు చేశారు. గతంలో మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సిరిసిల్లా శాసన సభ్యుడిగా పూర్వపు టెక్స్ టైల్ శాఖా మంత్రులకు రాసిన అనేక లేఖలు, అనేక వ్యక్తిగత సమావేశాలు , అధికారిక విజ్ఞప్తులు ఇప్పటివరకు కేంద్రం నుండి ఎటువంటి సానుకూల నిర్ణయానికి నోచుకోకపోవడం అన్యాయమన్నారు…అరుణ్ జైట్లీ , స్మృతి ఇరానీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ బతిమిలాడాం. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర కేంద్రం వివక్షకేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారన్నారు. సీపీసీడీఎస్‌( CPCDS ) నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధ్రువీకరించినా, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి? అని ప్రశ్నించారు.తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు. తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు.

గుండెకాయలాంటిదని పేర్కొన్నారు. సిరిసిల్ల లో 30 వేలకు పైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం, అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు , రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు.. ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసిందని కేటీఆర్ వివరించారు. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయని పదేపదే చెబుతున్నా, ఎటువంటి సాంకేతిక లేదా ఆర్థిక కారణాలు చూపకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటు అని ఎండగట్టారు. ఒకవైపు ‘ మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, తెలంగాణ విషయంలో ద్వంద నీతికి, చిత్తశుద్దిలేమికి అద్దంపడుతుందన్నారు…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959