ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు.!

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు…

_• ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, BRSనేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది._

*• రేపు ఉ.11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ విచారణకు రావాలని అందులో పేర్కొంది.*

_• ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం._

_• రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది..

ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణపై దర్యాఫ్తు సంస్థను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించామని, ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఈ కేసులో విచారించడానికి ఇంకా ఏమి మిగిలి ఉందని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959