గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి..

నిజామాబాద్‌లో గంజాయి బ్యాచ్‌ కారుతో ఢీకొట్టిన ఘటనలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌమ్య హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సౌమ్యకు ప్రభుత్వం అండగా లేదంటే చాలా విమర్శలు ఎదురైన తరుణంలో . సౌమ్య చికిత్స కోసం ప్రభుత్వం రూ.10 లక్షలను తక్షణ సాయం కింద మంజూరు చేయడం జరిగింది ..అయితే నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే తిరగడంతో నేడు ఆమె మృతి చెందడం జరిగింది..

నిందితులను పట్టుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. పారిపోయే ప్రయత్నంలో డ్రైవర్ కారును వెనక్కి తిప్పగ… అది విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో సౌమ్య కారు కింద పడిపోయారు. సౌమ్యను వెంటనే నిజామాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సిఫార్సు మేరకు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్కు తరలించారు. ఇన్ని రోజులు ఆమె ప్రాణాపాయంతో పోరాడి నేడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి..