రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్‌..

ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా, పంపిణీ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు.

పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంధన సంక్షోభంపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్రాల సన్నద్ధతను సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా తక్కిన రాష్ట్రాల మఖ్యమంత్రులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

హాజరైన సీఎంలు

ప్రధానమంత్రి నిర్వహించిన వర్చువల్ మీట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జేకీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు పాల్గొన్నారు.

ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాల‌కు ప్రాధాన్యత క్రమంలో క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ల‌ను పంపుతున్న విషయం చెప్పాను.

తెలంగాణలో సాధార‌ణ రోజుల్లో రోజుకు 36,189 కిలో లీట‌ర్ల పెట్రోల్‌, డీజిల్ వినియోగం జ‌రుగుతుంద‌ని, ప్ర‌స్తుతం 1,88,210 కిలో లీట‌ర్ల నిల్వ‌లు ఉన్న‌ట్లు తెలిపేరు..

దేశంలో ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. యుద్ధం కారణంగా ఎదురయ్యే సవాళ్లు, రాష్ట్రాల సన్నద్ధతపై ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక సూచనలు చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సంక్షోభం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం కావడంతో ప్రభుత్వం ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటు ఉభయ సభల్లో పశ్చిమ ఆసియా పరిస్థితిపై ప్రకటన చేసి దేశ ప్రజలకు భరోసా కల్పించారు.