తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ విభాగానికి ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉందని, సాంకేతికతను వినియోగించుకోవడంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని ఆయన కొనియాడారు.. ప్రస్తుత కాలంలో మారుతున్న నేరాల సరళిపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో జిల్లా ఎస్పీలు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇందుకోసం ‘ఈగల్’, ‘నార్కోటిక్’ విభాగాలను బలోపేతం చేసి మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో’ను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
Also Read – Tela