5 రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు
కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నేడు వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు…
*🔹ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు (12pm update)*
*1.తమిళనాడు (234 సీట్లు)*
DMK – 57
AIADMK – 72
*TVK – 105*
*2.పశ్చిమ బెంగాల్.. (293 సీట్లు)*
TMC – 100
*BJP – 188*
Othrs -3
*3.కేరళ.. (140 సీట్లు)*
*UDF – 92*
LDF – 41
BJP – 3
Othr – 4
*4.పుదుచ్చేరీ (30 సీట్లు.)*
*NDA – 15*
DMK – 11
Othr – 3
*5.అస్సోం.. (126 సీట్లు)*
*BJP – 98*
Cong – 26
AIUDF – 2
తమిళనాడులో 234 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 118.
పుదుచ్చేరిలో 30 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 16.
అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 64..
తమిళనాడు: స్టాలిన్ సహా DMK ప్రముఖుల వెనుకంజ..
కొళత్తూర్లో స్టాలిన్పై TVK అభ్యర్థి ఆధిక్యం…
Elections Resuits 2026.
పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 148.
కేరళలో 140 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 71.
తమిళనాడులో సెంచరీ దాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ
TVK – 101
DMK – 73
AIADMK – 50.
పశ్చిమ బెంగాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై టీఎంపీ, సీపీఐ(ఎం) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అవి మాక్ పోల్ స్లిప్పులని ఈసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ నాయకులు వినకపోవడంతో ఘటనపై ఈసీ చారణకు ఆదేశించింది. మమత పోటీ చేస్తున్న భవానీపూర్లోని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆందోళన నెలకొంది.TMC, బీజేపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు మణిగింది….
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. బెంగాల్లో 162 స్థానాలకు ట్రెండ్స్ వెలువడగా, వాటిలో 88 స్థానాల్లో బీజేపీ, 72 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నాయి. అస్సాంలో 126 స్థానాలకు గాను 54 స్థానాలకు ట్రెండ్స్ వెలువడగా, వాటిలో 44 స్థానాల్లో బీజేపీ, 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో 140 స్థానాలకు గాను 27 స్థానాలకు ట్రెండ్స్ వెలువడగా, వాటిలో 15 స్థానాల్లో యూడీఎఫ్, ఐదేసి స్థానాల్లో ఎల్డీఎఫ్, బీజేపీలు ఆధిక్యంలో ఉన్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తొలి ట్రెండ్స్ ప్రకారం, డీఎంకే 18 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 8 స్థానాల్లో, విజయ్ టీవీకే 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అదేవిధంగా, కేరళలో కూడా ఒక స్థానంలో ట్రెండ్లు వెలువడ్డాయి, అక్కడ యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. విజయ్ పోటీ చేసిన పెరంబూర్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. త్రిచి ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రం విజయ్ వెనుకబడి ఉన్నారు.