కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలను ఓ అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొందరు కూలీలు ఉదయాన్నే ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ.. నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను బలంగా ఢీకొట్టింది…

బ్రిడ్జి దగ్గర ఘటన..!

బ్రిడ్జి దగ్గర చోటు చేసుకుంది. ఉపాధి హామీ (Employment Guaranteed Workers) పనులకు వెళ్తున్న కూలీల ఆటోను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మృతులు సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడ్డ అధికారులు..

ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందిన వారిలో వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం (45)లు ఉన్నారు.ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కూలీలు మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణిలను స్థానికులు, పోలీసులు కలిసి తక్షణమే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతుండగా.. వీరి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి..