మరో 2గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం…!

*మరో 2గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం*

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది.

రాబోయే రెండు గంటల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

యాదాద్రి భువనగిరి, నల్గొండ, మేడ్చల్, యాచారం, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం.

భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.