చర్చనీయాంశంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో చోటుచేసుకున్న తాజా ఘటన..!

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో చోటుచేసుకున్న తాజా ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని BSF అడ్డుకుని తిరిగి పంపించే ప్రయత్నం చేయగా, అతడిని తమ దేశ పౌరుడిగా గుర్తించలేమని బంగ్లాదేశ్ వైపు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

దీంతో ఆ వ్యక్తి ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’ ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అక్రమ వలసలు, సరిహద్దు భద్రత,జాతీయ భద్రత వంటి అంశాలపై ఈ ఘటన కొత్త చర్చకు దారితీసింది….