ప్రపంచంలోనే తొలి ట్రిలియనీయార్ గా (రూ.95 లక్షల కోట్లు) ఎలాన్ మస్క్..

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీయార్ గా (రూ.95 లక్షల కోట్లు) ఎలాన్ మస్క్ అవతరించాడు.

_• మస్క్ జన్మించిన దక్షిణాఫ్రికా జీడీపీ కంటే ఈ సంపద రెండు రెట్లకుపైగా అధికం._

_• ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 21 దేశాల ఆర్థికవ్యవస్థ మాత్రమే ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంది._

_• మస్క్ సంపదను ప్రపంచంలోని జనాభాకు (820 కోట్ల మందికి ) పంచితే ఒక్కొక్కరికి రూ.10 వేలు వస్తాయి._

_• మస్క్ సంపదతో అమెరికాలో 25 లక్షల ఇళ్లు కొనుగోలు చేయవచ్చు._

_• ఈ ట్రిలియన్ డాలర్లను వరుసగా పేర్చితే… 15.6 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది._

_• ఈ పొడవు భూమి నుంచి చంద్రుడిపైకి వెళ్లి రావడానికి అవసరమైన దూరం కంటే 200 రెట్లు అధికం…

ప్రపంచ టెక్నాలజీ, వ్యాపార రంగంలో తిరుగులేని శక్తులలో ఒకరైన ఎలాన్ మస్క్.. అతి త్వరలో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’గా అవతరించబోతున్నారు. ఆయనకు చెందిన రాకెట్ తయారీ సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ రికార్డు స్థాయి ఐపీఓతో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ బంపర్ లిస్టింగ్ ఫలితంగా మస్క్ నికర ఆస్తి విలువ ఏకంగా 1.1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 95 లక్షల కోట్లు) మార్కును దాటబోతోందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ తన నివేదికలో వెల్లడించింది. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం ‘టెస్లా’, అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ లలో ఉన్న భారీ వాటాలే మస్క్ అపార సంపదకు ప్రధాన వనరులుగా ఉన్నాయి..కాగా, ఇటీవల ముగిసిన ఐపీఓలో స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సంగతి తెలిసిందే.

స్పేస్‌ఎక్స్ సంస్థలో ఎలాన్ మస్క్‌కు సుమారు 866 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల వాటా ఉంది. టెస్లా కంపెనీలోని వాటాలు, ఇతర ఆస్తులతో కలిపి లెక్కిస్తే.. అమెరికా స్టాక్ మార్కెట్లో స్పేస్‌ఎక్స్ షేర్ల ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభమైన (భారత కాలమానంలో శుక్రవారం రాత్రి 7 గంటలు) వెంటనే ఆయన నికర ఆస్తి విలువ 1.1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటనుంది. కంపెనీలు సమర్పించిన అధికారిక పత్రాల ఆధారంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్, రాయిటర్స్ సంస్థలు ఈ విషయాన్ని విశ్లేషించాయి.

మిగతా కుబేరుల కంటే ఎంతో దూరం!
ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ అంచనాల ప్రకారం.. ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ ఏకంగా 971 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే రికార్డు స్థాయిలో 274 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. గడిచిన ఏడాది కాలంలోనే ఆయన ఆస్తి విలువకు 351 బిలియన్ డాలర్లు అదనంగా చేరాయి. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడైన లారీ పేజ్ మొత్తం ఆస్తి (304 బిలియన్ డాలర్లు) కంటే మస్క్ ఒక్క ఏడాదిలో సంపాదించిన సంపదనే చాలా ఎక్కువ కావడం గమనార్హం..