రూ.11కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిన మోడల్..

మోడల్, Mrs కేరళం-2025 రన్నరప్ హర్షా సన్నీ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. నిన్న రాత్రి బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆమె ట్రాలీ బ్యాగును తనిఖీ చేయగా వ్యాక్యూమ్ సీల్ చేసి ఉన్న 11కేజీల డ్రగ్స్ బయటపడ్డాయి. వాటి విలువ రూ.11.82CR ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెను అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించింది..

మొత్తం 11 కిలోల డ్రగ్స్ పట్టుబడగా, వాటి విలువ సుమారు రూ.11.82 కోట్లుగా అధికారులు వెల్లడించారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ ఘటన కలకలం రేపుతోంది…