బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం..

బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం..

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా.. అకస్మాత్తుగా బండి సంజయ్ పై పడిన బెంచి.

వెంటనే అప్రమత్తమై ఆ బెంచ్‌ను పక్కకు తొలగించిన బీజేపీ నాయకులు..

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యార‌ని తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బండి సంజ‌య్‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది..స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా.. ఓ బెంచి అకస్మాత్తుగా బండి సంజయ్‌పై ప‌డింది. దీంతో వెంట‌నే అప్రమత్తమైన‌ బీజేపీ నాయకులు ఆ బెంచ్‌ను పక్కకు తొలగించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది..