ఆరుగురి హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు..పోక్సో కేసులో బెయిల్పై విడుదలైన రాజ్కుమార్.. ప్రతీకారాన్ని అత్యంత దారుణంగా..

షాబాద్ మండలంలో ఆరుగురి హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు..

పోక్సో కేసులో రెండు నెలల్లో బెయిల్‌పై విడుదలై మారణకాండ సృష్టించిన నిందితుడు..

షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన

సామూహిక హత్యలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పోక్సో కేసులో బెయిల్పై విడుదలైన రాజ్కుమార్.. ప్రతీకారాన్ని అత్యంత దారుణంగా తీర్చుకున్నాడు. గంటల వ్యవధిలోనే ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యలు జరిగిన తీరు, దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న వివరాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పార్వతి రాజ్కుమార్ కారులో బాధిత బాలిక(17) ఇంటికి ఓ కారులో చేరుకున్నాడు. ఆ సమయంలో బాలికను తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే వారి మాటలను పట్టించుకోకుండా బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామ శివారులోని చెరువు సమీపానికి తీసుకెళ్లాడు.

అక్కడ బాలికపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అక్కడి నుంచి నేరుగా మళ్లీ బాలిక ఇంటికే చేరుకున్న రాజ్కువ C ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్లను కత్తితో దాడి చేసి ఇద్దరినీ హతమార్చాడు. అక్కడి నుంచి రాజ్కుమార్ నేరుగా తన ఇంటికి వెళ్లాడు..

అసలు మొదలు ఇక్కడ..!

మే 16వ తేదీన పోక్సో కేసులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతురిని వేధిస్తున్నాడని బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, మే 26వ తేదీన రిమాండుకు తరలించిన పోలీసులు..

అయితే పోలీసులు కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం చర్చనీయాంశం..

మరోవైపు కేవలం రూ.20,000 పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ రావడంతో, బయటికి వచ్చి ఆరుగురిని కిరాతకంగా హతమార్చిన రాజ్ కుమార్..

ఆరుగురిని చంపేశాను, నేను కూడా చనిపోతున్నాను

హ*త్య చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపిన రాజ్ కుమార్

పోక్సో కేసులో బెయిల్ మీద విడుదల అయిన అనంతరం బాధిత బాలికను, ఆమె తల్లిని, నానమ్మతో పాటు, తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హ*తమార్చిన నిందితుడు

తాను కూడా చనిపోతున్నానని, ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పిన నిందితుడు

నిందితుడి తల్లిదండ్రుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు….

షాబాద్ మండలం

దైవాలగూడలో చోటుచేసుకున్న సామూహిక హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోక్సో కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ శనివారం ఉదయం షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నినాదాలు చేశారు. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టలేదని, బాధిత కుటుంబానికి ఎలాంటి భద్రత కల్పించలేదని ఆరోపించారు. బెయిల్పై విడుదలైన తర్వాత కూడా అతడి నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసినా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదని మండిపడ్డారు..

ఆరుగురి హత్యలకు షాబాద్ సీఐ, ఎస్సైల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. వారిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఒకే కుటుంబానికి చెందిన అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు..