ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అర్థరహితం….
BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు
దేవరకొండ………
నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం అర్ధరహితమని బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విద్యార్థి విభాగం(BRSV) రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు అన్నారు. స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంకా మీ రక్తదాహం తీరలేదా. 60 ఏళ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా.. సరిపోలేదా తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయటం మానుకొని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న నిరంతరం తెలంగాణ ప్రజల కోసం పాటుపడుతుందని అన్నారు.