ఆర్ధిక సహాయం అందజేసిన BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్..

నేరేడుగోమ్ము……..
నేరేడు గోమ్ము మండలం ధర్మ రెక్య తండా BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థికి ఆర్ధిక సహాయం అందజేత -BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ . ధర్మ రెక్య తండా BRS పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి స్వల్ప ఓట్లు తేడాతో ఓటమి పాలైన BRS పార్టీ ధర్మ రెక్య తండా నాయకులు ఆదేశానుసారం కొంత మొత్తం ఆర్ధిక సాయం అందజేశారు..స్థానిక సంస్థలు ఎన్నికలో తమ స్వంత ఆస్తులను అమ్ముకొని పోటీ చేసి స్వల్ప ఓట్లు తేడాతో పరాజయం పాలైన అభ్యర్థి చందా నాయక్ తిరిగి తమ జీవనం కొనసాగడం కోసం ఆటో ఇప్పించాలనీ, BRS పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నీ కోరగా వారిని ఆదుకోవడం కోసం ఆటో కు అయ్యే దాంట్లో కొంత నగదును ఆయనకు ధర్మ రెక్య BRS పార్టీ నాయకులు
తండా ప్రజల చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది..
అనంతరం వారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో నేరడగొమ్మ BRS మండల పార్టీ మాజీ అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, ధర్మ రెక్య తండా మాజీ సర్పంచ్ చెన్న నాయక్, పేర్వల మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, మాజీ సర్పంచ్ అజ్మపురం రామకృష్ణ, కేతవత్ పుల్ సింగ్ నాయక్, అనిల్, తండా ప్రజలు పాల్గొన్నారు.