టిపిసిసి ఎస్సీ విభాగం జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఏకుల రాజారావు జన్మదిన వేడుకలు

దేవరకొండ ……….
టిపిసిసి (TPCC) ఎస్సీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని బహుజన నాయకులు, దళిత నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, యేకుల రాజారావు గారికి మిఠాయిలు తినిపించి అభినందనలు అందజేశారు. బహుజనుల, దళితుల అభ్యున్నతికి మరియు పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను
ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
ఈ ఘనమైన జన్మదిన వేడుకల కార్యక్రమంలో ప్రముఖులు, నాయకులైన యేకుల సురేష్, బోయిన చంద్రమౌళి, మేడ సైదులు, భయ్య శ్రీను, నారిమల్ల మల్లేష్, అవుట మల్లేష్, ఎర్ర వెంకటయ్య, నిరటి బాలరాజు, చేపూరి మురళి, మరియు నారిమల్ల ఇద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ యేకుల రాజారావు కి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.