నేడు ఖర్గే ఛాంబర్లో ఇండి కూటమి నేతల సమావేశం.
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ..
నేడు ఖర్గే ఛాంబర్లో ఇండి కూటమి నేతల సమావేశం జరగనుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఉద్దవ్ ధాక్రేకు చెందిన పార్టీ నేతలతోపాటు ఇండి కూటమి నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
పార్లమెంటు సమావేశాల్లో…
పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ కేసుతో పాటు పలు కీలక అంశాలపై చర్చించాలని పట్టుబట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు..