ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం కార్యక్రమం …

దేవరకొండ……….

అమ్మవార్లకు ఒడిబియ్యం పోసే కార్యక్రమం కొరకు కొంతమంది మహిళలు ఆలంపల్లి దీపిక ఆధ్వర్యంలో ఒక గ్రూపుగా ఏర్పడి
దేవరకొండ పరిసర అమ్మవార్లకు ప్రతినెల ఒడిబియ్యం సమర్పించే కార్యక్రమంలో భాగంగా
సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి సమర్పించినారు.

ఒడిబియ్యం కార్యక్రమంలో భాగంగా బొంతపల్లి, తెలంగాణ కంచి, చిటుకుల చాముండేశ్వరి, వైకుంటపురం ఆలయాలకు వెళ్లి అందరూ బాగుండాలి దాంట్లో మేముండాలి అని మహిళలు కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలంపల్లి దీపిక, పసుపుల ధనలక్ష్మి, గోవిందు జ్యోతి, సముద్రాల సత్య శ్రీవాణి, పందిరి శ్రీదేవి, గుద్దేటి అంజని, అర్థం శ్రీలక్ష్మి, చందా అనురాధ, కర్నాటి రజిత, వీరమల్ల స్వప్న, షీలా స్వప్న, నేలoటి సంధ్య తదితరులు పాల్గొన్నారు.