శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ ను ప్రారంభించిన ఆర్.బి రాథోడ్.

దేవరకొండ ……….
వినియోగదారుల విశ్వాసాన్ని చూడగంటూ వ్యాపారం మన్నిక నమ్మకంతో నిర్వహించినట్లయితే వినియోగదారులకు నమ్మకం కలుగుతుందని తద్వారా వ్యాపార అభివృద్ధికి దోహదం జరుగుతుందని ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ బి రాథోడ్ అన్నారు. ఎన్ హెచ్ ఆర్ సి సభ్యుడు హరిప్రసాద్ పీఏ పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ దుకాణాన్ని సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ ఆర్.బి రాథోడ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషాలను శాలువాలతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు సైతం హరిప్రసాద్ శాలువతో ఘనంగా సన్మానించి వ్యాపార అభివృద్ధికి మరింత పట్టుదలతో కృషి చేయాలని అన్నారు.యువత వ్యాపార రంగంలో రాణించేందుకు స్వయం శక్తిగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ కుటుంబ సభ్యులు చిలుకూరి మహేందర్, ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులు నల్గొండ జిల్లా అధ్యక్షుడు బండి నరేష్, తడక మల్ల బిక్షమయ్య, గార్లపాటి శ్రీను , అల్తాఫ్ ఓర్సు వెంకటేష్, ఇబ్రహీం ,వెంకటేష్ ,మహేందర్, వెంకటయ్య, స్నేహితులు నాగార్జున నగేష్ ,అనిల్, అజయ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.