ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి..బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి.

-పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర

-విద్యరంగ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం.

– బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

దేవరకొండ……….
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
గురువారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన బిఆర్ఎస్వీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ….పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది అని ఆయన అన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతోందని అన్నారు.విద్యరంగ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అని ఆయన అన్నారు.
విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి వారి భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యను రాజకీయాలకు అతీతంగా పరిగణించి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్వీ నాయకులు బత్తుల ఆంజనేయులు, కొర్ర రాజేష్, అనిల్, వెంకటేష్, శ్రీను, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.