సర్పంచ్ ఎన్నికల వేళ మద్యం పట్టివేత..1,321 సీసాలు స్వాధీనం..!

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం కొండూరు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని నందిగామ పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలోని తోట నరేష్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో సీఐ పి.శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 1,321 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1,85,000 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రానున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యాన్ని నిల్వ ఉంచినట్లు ప్రాథమికంగా గుర్తించారు…ఈ ఘటనకు సంబంధించి తోట నరేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..