ఆప్యాయ పరామర్శకు హృదయపూర్వక కృతజ్ఞతలు..: చంద్రమౌళి.

దేవరకొండ: కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, ఆప్యాయంగా పరామర్శించిన NHRC స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎస్.డి. గౌస్ మరియు NHRC టీమ్‌కు మాకం చంద్రమౌళి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్న తన కుమార్తెను NHRC స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎస్.డి. గౌస్ ఆధ్వర్యంలోని బృందం ఇంటికి విచ్చేసి పరామర్శించింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మాకం చంద్రమౌళి మాట్లాడుతూ.. “ఈ కష్ట సమయంలో మేమున్నాం అంటూ మా కుటుంబానికి ధైర్యం చెప్పిన మీ ఆప్యాయత, మానవత్వం, అండదండలు మాకు ఎంతో విలువైనవి. మీరు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరువలేం. మా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎస్.డి. గౌస్ గారికి, మొత్తం NHRC టీమ్‌కు ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు..