గరిడేపల్లిలో కాంగ్రెస్‌ బాకీ కార్డుల పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….!

గరిడేపల్లిలో కాంగ్రెస్‌ బాకీ కార్డుల పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

ఆరు గ్యారంటీలు, 420 హామీలపై ప్రజల్లోకి బీఆర్ఎస్ పోరుబాట..– మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి

గరిడేపల్లి: హామీలు అబద్దాలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన వెయ్యి రోజుల పాలన విఫలమైందని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంక రెడ్డి అన్నారు మండల కేంద్రమైన గరిడేపల్లి లో శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అమలు కాని హామీలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే వెయ్యి రోజులు గడుస్తున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, అమలు కాని హామీలను గుర్తు చేస్తూ గ్రామగ్రామాన బాకీ కార్డులను పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు ఆయన తెలిపారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీల అమలు పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
నేటి నుంచి గ్రామగ్రామాన బాకీ కార్డుల పంపిణీతో పాటు ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

రైతుల సమస్యలు, వ్యవసాయానికి సాగునీరు, సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సాగర్ ఆయకట్టుకు సాగునీరును యధావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడియం స్వప్న, పెండెం వీరయ్య గౌడ్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, పెండెం ధనయ్య గౌడ్, రాజమల్లు, నగేష్, వేణు, వెంకటేష్, లింగయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.