శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి ఘనంగా వరుణాభిషేకం.. ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి – తీదేడు గ్రామ సర్పంచ్..

వర్షాలు సమృద్ధిగా కురవాలి…రైతులు సుభిక్షంగా ఉండాలి..
శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి ఘనంగా వరుణాభిషేకం.. ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
– తీదేడు గ్రామ సర్పంచ్

చింతపల్లి……
సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ తీదేడు గ్రామ శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వరుణాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో జీవించాలని,ప్రకృతి అనుకూలంగా ఉండి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…గ్రామ ప్రజల సంక్షేమం,రైతుల అభివృద్ధి, గ్రామ సుభిక్షం కోసం స్వామివారిని ప్రార్థించామని తెలిపారు. ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురభి ప్రభాకర్ శర్మ,ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖర్ రెడ్డి,సోనగంటి గోవర్ధనాచారి,పి.ఏ.సి‌.యస్‌ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,గ్రామ పాలక వర్గం సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్,రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి, శివర్ల పర్వతాలు యాదవ్,గ్రామ పెద్దలు మర్రు రామారావు,ఉలుపాల పురుషోత్తం రెడ్డి,సిమర్ల శ్రీను యాదవ్,మర్రు శ్రీనివాస రావు,మర్రు సురెందర్ రావు,కాయితి బచ్చిరెడ్డి,జూలురి శ్రీధర్ ,దాసరి తిరుపతయ్య,వీరమల్ల వెంకటయ్య,శివర్ల రాములు,మర్రు జనార్దన్ రావు,సిమర్ల నర్సింహా,మెరిక శంకరయ్య,మెరిక శంకర్,నేలపట్ల అనిల్,కాయితి బుచ్చిరెడ్డి, బొడ్డు లక్ష్మయ్య,బొడ్డు శ్రీశైలం ,బొడ్డు సంతోష్,రాశిక మల్లయ్య,రాశిక యాదయ్య,రాశిక సైదులు,మునగాల అశోక్,పంగ సత్తయ్య,మెండె మల్లయ్య,రాశిక వెంకటయ్య,మునగాల లక్ష్మణ్,శివర్ల ప్రవీణ్, బొడ్డు కిరణ్,భక్తులు, మహిళలు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.