– తీదేడులో భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి బోనాలు
– మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
– పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
చింతపల్లి………
చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన పెట్టుకుని పెద్దమ్మ తల్లి ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన గ్రామ ప్రజలకు, మహిళలకు, యువతకు మరియు మల్లికార్జున యాదవ సంఘం సభ్యులకు సంఘం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున యాదవ సంఘం నాయకులు,సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.