కేంద్రమంత్రి చేతులమీదుగా ఘనంగా షేక్ బహార్ అలీ కి సన్మానం..!

సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా హైదరాబాదులో పతంజలి యోగ వారు TYTCC యోగ సంఘం ,
(జాయింట్ యాక్షన్ కమిటీ) వారు కలిసి తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా చేసిన యోగా గురువులకు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి బొగ్గు మరియు గనుల శాఖ వారు, ఖమ్మం జిల్లా కల్లూరు మండల వాస్తవ్యులు శ్రద్ధ శ్రీ యోగాచార్యులు ఆయుర్వేద వైద్య నిపుణులు షేక్ బహార్ అలీ ,వారు ప్రజలకు విద్యార్థినీ విద్యార్థులకు యువతి యువకులకు ఆరోగ్యవంతులకు అనారోగ్యాలకు చేసే ఉచిత యోగా ఆయుర్వేద ప్రకృతి వైద్య విశిష్ట సేవలకు గాను శ్రీ ఉత్తమ యోగాచార్యులుగా సన్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పతంజలి అధ్యక్షులు శ్రీధర్ బాబు కృపాకర్ గారు మరియు TYTCC తెలంగాణ యోగ సంఘ అధ్యక్షులు శ్రీ సత్య రెడ్డి బృజ్ భూషణ్ గారు మరియు రాష్ట్రవ్యాప్తంగా వచ్చినటువంటి యోగా గురువులు, యోగా మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయటం జరిగింది. ఇంత మంచి అవకాశం వచ్చి నాకు సన్మానం చేసినటువంటి కేంద్ర మంత్రి కి మరియు రాష్ట్ర పతంజలి అధ్యక్షులు కు రాష్ట్ర యోగ సంఘం అధ్యక్షులు వారికి యోగా గురువులకు యోగా మాతలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.