సీనియర్ పాత్రికేయులు నరేందర్ రెడ్డి సతీమణి రిటైర్డ్ టీచర్ జానకమ్మ మృతి బాధాకరం… కొప్పుల సైదిరెడ్డి..
రిటైర్డ్ టీచర్ జానకమ్మ పార్థివదేహానికి నివాళులు..
ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన..జానకమ్మ మృతి బాధాకరం -కొప్పుల సైదిరెడ్డి.
హుజూర్నగర్ పట్టణానికి చెందిన ఈనాడు (విలేఖరి) సీనియర్ పాత్రికేయులు నరేందర్ రెడ్డి వారి సతీమణి రిటైర్డ్ టీచర్ జానకమ్మ బుధవారం నాడు అనారోగ్యంతో మృతి చెందినారు. ఈ విషయం తెలుసుకున్న హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ, కొప్పుల సైదిరెడ్డి నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆమె పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం నరేందర్ రెడ్డి ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ.. ప్రముఖ విశ్రాంత ఉపాధ్యాయురాలు నూకల జానకిగారి మరణం చాలా బాధాకరం అని కొంతకాలంగా వారు అనారోగ్యంతో బాధపడుతూ,నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. విద్యా బోధనను కేవలం వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి, ఎందరో విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకంగా నిలిచారు అని విద్యతో పాటు మానవీయ విలువలను పెంపొందించడంలో సామాజిక సేవలో ఆమె చేసిన కృషి చిరస్మరణీయం అని ఆమె మృతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, స్థానిక సమాజానికి తీరని లోటని, అన్నారు.
ఈ కార్యక్రమంలో… లక్కవరం గ్రామ సర్పంచ్ లింగస్వామి యాదవ్, మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పచులు చీకూరి రాజారావు, షేక్ అలీ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య, బిఆర్ఎస్ నాయకులు మల్లేపల్లి నరసింహరావు, దుగ్గి నరసింహరావు తదితరులు పాల్గొని నరేందర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.