.
మిర్యాలగూడ:
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆదేశానుసారం 12వ వార్డు ఇంచార్జ్ బంటు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తండా ప్రాంతాలకు చెందిన గిరిజనులు, లంబాడీ నాయకులు, తండావాసులు కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజనులు, తండావాసుల అభివృద్ధి కోసం గతంలో చేపట్టిన చర్యలను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు అన్న భీమోజు నాగార్జున చారి, BRS మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, PACS చైర్మన్ బంటు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దం, pasha BRS మాజీ కౌన్సిలర్ మాజిద్, drsu నాయక్, రవి నాయక్, బాలు నాయక్, రాంబాబు నాయక్, సంతోష్ నాయక్, బుజ్జి నాయక్, అభినాయక్, శ్రీధర్ నాయక్, కృష్ణ నాయక్, రమేష్, నరేష్, చింటూ నాయక్, నరసింహ, మహేష్ నాయక్, సైదా నాయక్ తదితరులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.