మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు..
మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు..
రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి..
ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి..
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో..
ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము
మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి.- కేటీఆర్…
సిద్దిపేటలో సభలు పెట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో చురకలించారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లకొచ్చి మీకు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టానని చెప్తారా..? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన వెధవను నేనే అని చెప్తాడా..? లేకపోతే సిరిసిల్ల నేతన్నలు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టడానికి కారణం నేనే అని చెప్తాడా..? సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్. ఒక డిగ్రీ కాలేజ్ లేని సిరిసిల్లలో ఒక మెడికల్ కాలేజ్, ఒక వ్యవసాయం కాలేజ్, ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్, ఒక జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్.. ఇలా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చింది కేసీఆర్. మరి అవన్నీ చూసి కొడంగల్లో ఇంప్లిమెంట్ చేయడానికి వస్తుండేమో నాకు తెల్వదన్నారు…సిరిసిల్లకొచ్చి ఏం చెస్తారో కూడా చెప్పాల్సి ఉంటుంది.. మూడేళ్ల తర్వాత కూడా పాడిందే పాట అని మాట్లాడితే కాదు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. మీరు ఈ మూడేళ్లలో సిరిసిల్లకు చేసిందేమిటీ..సిరిసిల్ల ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రం.. అక్కడి నేతన్నలు, రైతన్నలు, కార్మిక వర్గానికి మీరు ఇప్పటికే వెన్నుపోటు పొడిచారు. వారి ఆత్మహత్యలకు కారణమయ్యారు. అక్కడి కర్షక లోకం ఇవాళ కసి మీద ఉంది.. అక్కడ కాళేశ్వరం ఎండబెట్టి.. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి కర్షకుల పొట్ట కొట్టారు. బతుకమ్మ చీరలు బంద్ చేసి కార్మికుల పొట్ట కొట్టారు. ఇవన్నీ కూడా సిరిసిల్ల ప్రజలకు తెలుసునన్నారు.
మీరొచ్చి మీ నోటి దూల తీర్చుకునేందుకు ఏదైనా మాట్లాడుతాం. పైశాచికానందం పొందుతామంటే మీకు స్వాగతం.. శాసనసభలో ఆరోపణలు చేశారు.. 8 వేల ఎకరాలు మేం సిరిసిల్లలో కబ్జా చేశామన్నారు. ఆ 8 వేల ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి.. ఎక్కడివి.. ఏ ఊరు.. సర్వే నంబర్లు ఎంత..? ఎవరు కబ్జా పెట్టారు..? ఎప్పుడు పెట్టారు..? మళ్లీ 2400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.. దీనిపై శ్వేతపత్రం ప్రచురించండి.. స్పష్టంగా పేర్లతో సహా బయటపెట్టండని కేటీఆర్ సవాలు విసిరారు..