తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం నల్గొండ జిల్లా ప్రధానకార్యదర్శిగా చిరంజీవి చాట్ల..!

తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్
సర్పంచుల సంఘం నల్గొండ జిల్లా ప్రధానకార్యదర్శిగా చిరంజీవి చాట్ల

చందంపేట……….
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా చందంపేట మండలం చిత్రియాల గ్రామ పంచాయతీ కి చెందిన సర్పంచ్ చిరంజీవి చాట్ల అడ్వకేట్ ని ఎన్నుకోవడం జరిగింది
ఈ ఎన్నికకు సంబంధించిన నియామక పత్రాన్ని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి చాట్ల మాట్లాడుతూ నాకు అప్పజెప్పిన భాద్యతలను,సర్పంచుల హక్కులను,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ వారికి,డా॥ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి, మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కి మరియు జిల్లా సర్పంచులకు ,నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన చిత్రియాల గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.