AI తప్పిదం’ ..ఏఐ (AI) నిఘా డేటాబేస్‌ ఇరాన్‌ లో…అమెరికా బాంబుల వర్షం. .123 మంది చిన్నారులు మృతి..!

2026 ఫిబ్రవరిలో ప్రాథమిక పాఠశాల ప్రాంతాన్ని ఏఐ (AI) నిఘా డేటాబేస్‌ ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC)కు చెందిన సైనిక స్థావరంగా గుర్తించడమే కారణమని తాజాగా దర్యాప్తులో బయటపడింది..అయితే, కాలక్రమంలో ఆ ప్రాంతంలో చాలా మార్పులు జరిగాయి. పాత సైనిక స్థావరం ఉన్న ప్రదేశంలో తర్వాత పాఠశాల నిర్వహిస్తున్నప్పటికీ.. నిఘా డేటాబేస్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం అప్‌డేట్ కాలేదు. శాటిలైట్ చిత్రాల్లో పాఠశాల ప్రాంతాన్ని సైనిక స్థావరం నుంచి వేరు చేసేందుకు ప్రత్యేక గోడలు, ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసారు. అక్కడ ఫుట్‌బాల్ మైదానం కూడా స్పష్టంగా కనిపించింది. పాఠశాలలో పౌర కార్యకలాపాలు జరుగుతున్నాయనడానికి అవి ముఖ్య ఆధారాలు.

AI తప్పిదం’ మాత్రమే కాదా?

అమెరికా సెంట్రల్ కమాండ్ ఉపయోగించే Maven Smart AI వ్యవస్థ శాటిలైట్ చిత్రాలు, రాడార్, డ్రోన్ ఫీడ్లు, ఇతర నిఘా సమాచారం ఆధారంగా ఇరాన్‌ లోని లక్ష్యాలను గుర్తించడంలో సాయం చేసింది. లక్ష్యాలను విశ్లేషించడం, ప్రాధాన్యతా క్రమంలో పెట్టడం, దాడికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయడం వంటి పనులు చేసింది. అయితే పాత డేటా, అప్‌డేట్ కాని నిఘా సమాచారం, దానిని సరిచూసే మానవ ప్రక్రియలో లోపాలు స్పస్టంగా బయటపడ్డాయి.

‘కిల్ చైన్’ అంటే ఏమిటి?

అమెరికా సైనిక పరిభాషలో ‘కిల్ చైన్’ అంటే ఒక లక్ష్యాన్ని గుర్తించినప్పటి నుంచి దానిపై దాడి చేసే వరకు జరిగే మొత్తం ప్రక్రియ. ముందుగా లక్ష్యాన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత దాని వివరాలను పరిశీలిస్తారు. అది నిజంగా సైనిక లక్ష్యమేనా? అక్కడ పౌరులు ఉన్నారా? వంటి అంశాలను తనిఖీ చేస్తారు. చివరగా దాడికి అనుమతి ఇచ్చి ఆయుధాన్ని ప్రయోగిస్తారు.

మానవ తనిఖీ ఎందుకు కీలకం?

పాత నిఘా సమాచారం, అప్‌డేట్ కాని చిత్రాలు, AIపై అధికంగా ఆధారపడటం వంటి అంశాలు దాడికి దోహదపడ్డాయని సెంట్ కామ్ అంతర్గత సమీక్షలో గుర్తించారు. పాత డేటా, సరైన సమయంలో అప్‌డేట్ కాని సమాచారం, మానవ తనిఖీలో లోపాలు.. ఇవన్నీ కలిసి ప్రమాదకరమైన పాఠశాల దాడికి దారితీసినట్లు గుర్తించారు. AI వ్యవస్థ ఎంత ఆధునికమైనది అయినా దానికి అందే సమాచారం సరైనదిగా ఉండాలి. ముఖ్యంగా పౌరుల ప్రాణాలకు సంబంధించిన సైనిక నిర్ణయాల్లో మానవుల తుది పరిశీలన కీలకం. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ తన లక్ష్య నిర్ధారణ ప్రక్రియలో మార్పులు చేసింది.