దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాయు నాణ్యత (Air Quality) క్షీణించింది. ఈ ఉదయం AQI ఉన్నత స్థాయి నుంచి సాధారణ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ 129 గా ఉంది. గత ఐదేళ్ల నుంచి అంటే 2022 నుంచి 2026 వరకు ఢిల్లీలో గాలి నాణ్యతను పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ (September) నెల సగటు కూడా చాలా తక్కువగా ఉంది. అంటే గడిచిన నాలుగు సెప్టెంబర్ల కంటే ఈ సెప్టెంబర్లోనే తక్కువ నాణ్యత ఉన్నది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది… ఢిల్లీలో ఏటా శీతాకాలంలో గాలి నాణ్యత క్షీణించడానికి పంట వ్యర్థాలను కాల్చడమే (Stuble burning) ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. నాలుగు రాష్ట్రాలలోని 19 చోట్ల పంటవ్యార్థాలను కాల్చారు. అందులో పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఏడేసి చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నాలుగు మధ్యప్రదేశ్లో ఒకటి హర్యానాలో జరిగాయి. సెప్టెంబర్ 15 నుండి 30 మధ్య ఆరు రాష్ట్రాలలో మొత్తం 114 పంట వ్యర్థాలను కాల్చిన ఘటనలను అధికారులు గుర్తించారు…
వాటిలో పంజాబ్లో 59, ఉత్తరప్రదేశ్లో 32, మధ్యప్రదేశ్లో 17, హర్యానాలో మూడు, రాజస్థాన్లో రెండు, ఢిల్లీలో ఒకటి ఉన్నాయని డేటా వెల్లడించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం.. గడిచిన ఐదు రోజులపాటు సంతృప్తికరమైన ఏక్యూఐ ఉండగా ఇప్పుడు మళ్లీ సాధారణ స్థాయికి పడిపోయింది. సీపీసీబీ వర్గీకరణ ప్రకారం.. 0-50 AQI మంచిది, 51-100 AQI సంతృప్తికరమైనది, 101-200 AQI మితమైనది, 201-300 AQI పేలవమైనది, 301-400 AQI చాలా పేలవమైనది, 401-500 AQI తీవ్రమైనదిగా పరిగణిస్తారు.