కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు.. ఒంటెద్దు నరసింహారెడ్డి..

సూర్యాపేట జిల్లా….. మేళ్లచెరువు, చింతలపాలెం మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి .. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నమోదు ప్రక్రియతో పాటు బిఆర్ఎస్ పార్టీ గెలుపుకి అనుసరించాల్సిన విధివిధానాలపై నాయకులకు వివరించారు…. ఐడియల్ స్కూల్లో పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు నమోదు పత్రాన్ని అందించి ఎలా నింపాలి అనే దానిపై అవగాహన కల్పించారు.. అనంతరం ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలి అని అన్నారు …కాంగ్రెస్ ప్రభుత్వం పై అన్ని వర్గాల ప్రజలకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుందని తెలిపారు.. యువత ఆలోచించి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు…గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూసి హక్కున చేర్చుకుందని అన్నారు .. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరు ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ పాలన సాగించడం లేదని అన్నారు.. వారి వ్యక్తిగత లావాపేక్ష కోసం వెంపర్లాడుతున్నట్లుగా తెలిపారు…యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.. బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలన్నిటిని కాంగ్రెస్ తమ లెక్కలో వేసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు KLN రెడ్డి….మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి.. స్థానిక సర్పంచ్ బచ్చు పద్మ శ్రీనివాస్ రెడ్డి… మండలంలోని నాయకులు,, సర్పంచులు, వార్డ్ నెంబర్లు, పాల్గొన్నారు.