ఆదర్శ కుటుంబం’ రివ్యూ..!

ఆదర్శ కుటుంబం’ రివ్యూ – Aadarsha Kutumbam Review.

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోకి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కామెడీ, ఎమోషన్స్‌తో ఇంత వరకు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించారు. మరి ఈ ఇద్దరూ కలిసి ఇన్నేళ్ల తర్వాత ‘ ఆదర్శ కుటుంబం ఇంటి నెం. 47’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. నేడు (అక్టోబర్ 30) విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉందా? లేదా? ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

కథ (Aadarsha Kutumbam Story): చిట్టిబాబు (వెంకటేష్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి) దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పెద్దది, పేరు సంపూర్ణ (యువీనా). అబ్బాయి పేరు స్వర (ప్రజ్వల్). భార్య చేసిన పనుల వల్ల సాధారణ బ్యాంకు ఉద్యోగి అయినటువంటి భర్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఓ వైపు ఆ భాధ… మరో వైపు పిల్లలు చేసే పనుల వల్ల వచ్చే తలనొప్పులు… సమస్యల్లో ఉన్న చిట్టిబాబుకు వంద కోట్ల లాటరీ వరిస్తుంది. దాంతో గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతుంది చిట్టిబాబు ఫ్యామిలీ.

ఆదర్శ కుటుంబం AK 47 కథ..

ఒక హాస్పిటల్లో ఉద్యోగం చేసే చిట్టిబాబు (వెంకటేష్), తన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), కొడుకు సర్వ (ప్రజ్వల్), కుమార్తె (యువినా పార్థవి) తో ఒక సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటాడు. భార్య చీటీ పాట కారణంగా నాలుగు లక్షలు నష్టపోవడంతో పాటు, కొడుకు ఆపరేషన్ కోసం రెండు లక్షలు కావాలని తెలియడంతో, ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే, అనుకోకుండా కొన్న ఒక లాటరీ టికెట్ ద్వారా ఈ ఫ్యామిలీకి వంద కోట్లు వచ్చి పడతాయి. దీంతో అప్పటి వరకు ఒక చిన్న కాలనీలో ఉండే వాళ్లు పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతారు.

బిహార్‌కి చెందిన చందన్ (ఉదయ్‌బిర్ సంధు), నీలా (దేవియాని శర్మ) గ్యాంగ్ దోపీడి, హత్యలు చేస్తుంటుంది. మహారాష్ట్రలోని గోరేగావ్‌‌లో మధు సర్కార్‌లో ఇంట్లో దోపిడీ చేసి జడ్జ్ అయిన ప్రదీప్ సర్కార్ (నాజర్)ని హత్య చేస్తుంది. ఆ తర్వాత వారి కన్ను తెలంగాణ మీద పడిందని ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వస్తుంది. దీంతో ఎస్పీ దామోదర్ నాయుడు (నారా రోహిత్) ఆ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకో వైపు చిట్టి బాబు (వెంకటేష్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి), సంపూర్ణ (యువినా పార్వతి), సర్వ (ప్రజ్వల్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి చిట్టి బాబుకి వంద కోట్ల లాటరీ తగులుతుంది. ఆపై బీహార్ గ్యాంగ్ కన్ను చిట్టిబాబు ఫ్యామిలీ మీద పడుతుంది. మరి ఆ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని చిట్టిబాబు ఎలా కాపాడుకుంటాడు? అసలు ఈ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ప్లాన్ ఏంటి? అసలు ఇందులో వేటాడేది ఎవరు? ఎర ఎవరు? చివరకు బలి అయ్యేది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

ప్రస్తుతం ఉన్న ఆడియెన్స్‌కి రక్తపాతం, హై ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్, చెవులు మోత మోగేలా బీజీఎం ఇష్టంగా ఉంటోంది. త్రివిక్రమ్ కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యాడు. అయితే తనకు వచ్చిన, నచ్చిన గ్రౌండ్‌ని మాత్రం వదిలి పెట్టలేదు. తను దిట్ట అయిన కామెడీ, ప్రాస, పంచ్‌ల్ని వదలకుండా ఈ క్రైమ్, యాక్షన్‌ని అందరికీ నచ్చేలా తెరకెక్కించడంలో దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఓ రెండు, మూడు చోట్ల తప్పా మిగిలిన స్క్రీన్ ప్లే, కథ, కథనాన్ని అంతా కూడా ప్రేక్షకులు గెస్ చేస్తూ ఉంటారు. అదే ఈ సినిమాకి కాస్త మైనస్ అవుతుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా వెంకీ కామెడీ టైమింగ్‌తో త్రివిక్రమ్ కవర్ చేసేస్తాడు….దొంగల గ్యాంగ్, వారు హత్యలు చేసే విధానం, వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నం అంటూ కథను చాలా సీరియస్‌గానే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత చిట్టిబాబు ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. అక్కడి నుంచి దాదాపు ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కథ సాదాసీదాగా, ఊహకందేలా సాగుతుంది. అక్కడ మనకు కొత్తదనం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ వెంకీ కామెడీ, సత్య ట్రాక్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని నవ్వించేలా ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో గురూజీ అందరి మైండ్ బ్లాక్ చేసేస్తాడు. ఆ బ్లాక్‌ని చాలా స్టైలీష్‌గా డిజైన్ చేసుకున్నారు. అక్కడి యాక్షన్, బీజీఎం అన్నీ కూడా బాగుంటాయి…