హైదరాబాద్ నగరంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి జలమయమై రోడ్లు

హైదరాబాద్: నగరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా ప్రమత్తతో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నారు. ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతాలు, నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు…