అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం…

అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
R9TELUGUNEWS.com..అమెరికా కెంటకీ రాష్ట్రంలో 70 మంది క్యాండిల్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది..
ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోవటంతో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కెంటకీలో మొత్తం రెండు వందల మైళ్ల నుంచి 227 మైళ్ల వరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. రాష్ట్రంలోని మేఫీల్డ్‌ నగరంలో టోర్నడోల దెబ్బకు బాంబు పేలినట్లుగా అనిపించిందని చెబుతున్నారు స్థానికులు. ఇక..కెంటకీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన గాలులకు. కరెంటు స్తంభాలు నేలకూలాయి. వైర్లు తెగిపోయాయ్. దాదాపు మూడు లక్షల మందికి విద్యుత్ లేకుండా పోయింది. టోర్నడోల ప్రభావం తగ్గిన తర్వాత.. విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు. టోర్నడోల దెబ్బకు ఎరిగిపడ్డాయ్.
పరిస్థితులు ఆందోళనకరంగా మారటంతో. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకు. ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కెంటకీ రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యంత ప్రమాదకరమైన టోర్నడో అని గవర్నర్ అండీ బేషర్ తెలిపారు. అటు. మిస్సోరిలో ఒకరు మృత్యువాతపడ్డారు. కొన్ని ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంపై టోర్నడోలు విరుచుకుపడ్డాయి. 1925వ సంవత్సరంలో మిసోరిలో 219 మైళ్ల మేరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. అప్పట్లో ఇక్కడ 695 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు.ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగిలోనూ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. దక్షిణ ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగిలో వంద మంది చిక్కుకుపోయారు. మరోవైపు.. అర్కాన్సాస్‌లోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో ఇరవై మంది చిక్కుకున్నారు. వాతావరణ మార్పులతో టోర్నడోలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టెన్నిసీలో ముగ్గురు చనిపోయారు. ఇక్కడ డిసెంబరులో టోర్నడోలు అరుదుగా ఏర్పడతాయని చెబుతున్నారు.