ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ముద్రడగ పధ్మనాభానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రడగ పధ్మనాభానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఉదయం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు..ముద్రగడ మృతిపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంపాతం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై ఏపీ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విచారం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన అందించిన సేవలను గవర్నర్‌ గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముద్రగడ మరణవార్త విచారం కలిగించిందని CM చంద్రబాబు తెలిపారు. పద్మనాభం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు. ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ‘ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..