ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ ..

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం-కన్నబాబు.

చంద్రబాబు హోదా మరిచి మాట్లాడుతున్నారు
గెలవడం చేతకాక కుట్రలు చేస్తున్నారు-కన్నబాబు.

సుప్రీంకోర్ట్ తీర్పు ఈసీ, ప్రభుత్వానికి చెంపపెట్టు.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగడం లేదు.

మేం పోటీలో వెనక్కి తగ్గేది లేదు..పోరాటం చేస్తాం..

అధికారులు పద్ధతి మార్చుకోవాలి-గుడివాడ అమరనాథ్‌….

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల గడువును పొడిగించేందుకు నిరాకరించిన ధర్మాసనం, వైసీపీ ఫిర్యాదు చేసిన నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రం పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) ఆదేశించింది. దీంతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.

తమ అభ్యర్థులను 19 చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, ఈ ప్రక్రియకు విఘాతం కలుగుతుంటే రాజ్యాంగ కోర్టులు మౌనంగా ఉండలేవని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో వాటిని పరిశీలించి, నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించాలా వద్దా అనే దానిపై రేపటి లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. అవసరమైతే జిల్లా కలెక్టర్ ఎదుట నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని సూచించింది.

ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై అక్టోబర్ 27న తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్‌ఈసీని ఆదేశిస్తూ, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయంపైనే కేంద్రీకృతమైంది. .