భారీ నుంచి అతిభారీ వర్షాలు..బయటకు రావొద్దంటూ హెచ్చరికలు..
హైదరాబాద్‌లో భారీవర్షం, ఉదయం వరకు ఇదే పరిస్థితి
ఏపీలో (ap ) వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పిడుగులతో కూడిన వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు..రుతు పవన గాలులు కొనసాగనున్నాయని.. 40-50 కిమీ వేగంతో గాలుల వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించింది..ఇవాళ (శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు (ఆదివారం)(sounday ) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని సూచించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..
హైదరాబాద్‌లో (Hyderabad) భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయిన్ పల్లి మీదుగా వర్షం మొదలైంది. అలా సికింద్రాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. ఇటు రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోఠి, బేగం బజార్, నారాయణ గూడ, హిమాయత్ నగర్లో భారీ వర్షం పడుతోంది. పాతబస్తీలోని బార్కస్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, టోలిచౌకి, కార్వాన్ను భారీవర్షం ముంచెత్తింది.
వాతావరణ శాఖ అలెర్ట్ alert : వర్షం రాత్రి వరకు కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైనతే తప్పా భయటకు రావొద్దని తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు మారేడుపల్లి పికెట్ ఏరియాలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాచారంలో 10, మూసారంబాగ్లో 9.8, అడ్డగుట్ట 9.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోతలాంటి వర్షంతో డ్రైనేజీలు భయంకరంగా పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా పలుచోట్ల అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు..
పొంగుతున్న మ్యాన్‌హోళ్లు : భారీవర్షం, ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో యూసఫ్‌గూడ, శ్రీకృష్ణానగర్‌లో రహదారులు మునిగిపోయాయి. శ్రీకృష్ణానగర్‌లో మ్యాన్ హోల్ పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం, ప్యాట్నీ, రెజిమెంటల్ బజార్ వద్ద రహదారిపై మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. ఇక్కడి సిక్ విలేజ్ రోడు పూర్తిగా నీట మునిగిపోయింది. ముషీరాబాద్ బాపూజీనగర్‌లో నాలా పై నుంచి వరద ప్రవాహం వెళుతోంది. రాంనగర్ బాప్టిస్ట్ చర్చి వద్ద రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. మాదాపూర్‌లో కురుస్తున్న భారీ వర్షానికి మాదాపూర్ కాకతీయ హిల్స్ – జూబీహిల్స్ మార్గంలో ప్రధాన రోడ్డుపై చేరిన వరద నీరు చేరింది..
వరదనీటిలో ఆర్టీసీ బస్సు : మరోవైపు భారీ వర్షానికి చింతల్ లోని గణేష్ నగర్ కాలనీలో భారీగా వర్షపు నీరు చేరింది. కాలనీలో పార్క్ చేసి ఉన్న వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఆరాఘర్ ప్రైఓవర్ పక్కన వరదనీటితో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్లాక ఆగిపోవడంతో అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు..
ఉప్పల్ టూ హబ్సిగూడ ట్రాఫిక్ జామ్ : ఉప్పల్ ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. క్షణాల్లోనే కుంభవృష్టిగా కురవడంతో వాననీరంతా రోడ్లపై భారీగా చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా రోడ్లపై ప్రయాణించే వీలు లేకపోవడంతో ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలాచోట్ల చెరువులను తలపిస్తున్న రహదారుల్లో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్కాజ్‌గిరిలోని గౌతంనగర్ డివిజన్లో పలువురి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది..