అధికారులను సస్పెండ్ చేస్తే రైతుల బాధలు తీరుతాయా రేవంత్ రెడ్డి?
ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే 12 లక్షల ఎకరాలు ఎండిపోయాయి.
ఇంకో 20 రోజులు కాపాడితే మిగతా పంటలు ఎండిపోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.
ఎక్కడికి వెళ్లినా మోటర్లు కాలిపోతున్నాయని రైతులు చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు కదా?
వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని, పంటలు ఎండిపోయిన రైతులకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము.– హరీష్ రావు
గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని మేం గతంలో కూడా చాలాసార్లు చెప్పామన్నారు.. ..10 నెలల క్రితమే ఎల్నినో వస్తుందని కరువు పరిస్థితులు ఏర్పడుతాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వాలను హెచ్చరించారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. పత్తి లాంటి పంట కనీసం దిగుబడి కాదు.. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
పత్తి దిగుబడి బాగా తగ్గిపోయి ఎకరాకు 2-3 క్వింటాళ్లు కూడా రానట్వంటి పరిస్థితి ఉన్నది. పత్తి దిగుబడి బాగా తగ్గిపోయిందన్నారు హరీశ్ రావు.. 10-12 లక్షల ఎకరాల్లో పంటలు బాగా ఎండిపోతున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో ప్రజలు తాగునీటికి, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. పక్క రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించాయి. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించి రైతాంగానికి అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తున్నారు.. కానీ ఇంతవరకు మన తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు.. తక్షణ ఆర్థిక సాయం ప్రకటించలేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలో ఫెయిల్ అయిపోయారన్నారు. ఇయ్యాళ్ల కొందామంటే కరెంట్ లేదని రేవంత్ రెడ్డి బీద అరుపులు మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు..