బెంగుళూరులో ఖర్జేను పరామర్శించిన సీఎం
సీఎం రేవంత్రెడ్డి నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ అస్వస్థతకు గురై బెంగళూరులోని ఎంఎస్ రామయ్య చేరారు.
ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఖర్గేను సీఎం రేవంత్ పరామర్శించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం. సీఎం ఖర్గేను కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు.