నల్లగొండ జిల్లా :-
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై బస్సు దగ్ధం….
చిట్యాల మండలం పిట్టంపల్లి స్టేజ్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో విహారి ట్రావెల్స్ బస్సు లో మంటలు…
అప్రమత్తమైన డ్రైవర్…ప్రయాణికులను కిందికి దించిన డ్రైవర్…
సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు…
తప్పిన పెను ప్రమాదం…
ప్రమాద సమయంలో సుమారు 32 మంది ప్రయాణికులు….
హైద్రాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న స్లీపర్ కోచ్ ఏసీ బస్సు…
మెయిన్ డోర్ తో పాటు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని బయటికి దిగిన ప్రయాణికులు…
అలా ప్రయాణికులు బయటికి దిగిన 5 నిమిషాలకే అగ్నికి ఆహుతై పోయిన విహారి ట్రావెల్స్ బస్సు….
ఘటనతో మరోసారి బయటపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యం,నిర్వాకం….
రాష్ట్రంలో వరసగా బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు, చేవెళ్ల ఇలా తెలుగు రాష్ట్రాలలో ఘోర బస్సు ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి. అయితే, ఈరోజు ఉదయం తాజాగా మరో ఘోర బస్సు ప్రమాదం నల్గొండ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ బయలు దేరిన విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని మరీ బయటికి దూకారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను R9TELUGUNEWS.COM. వీక్షించవచ్చు..
అంతేకాకుండా మీకు తెలిసిన సమాచారాన్ని మాకు పంపించండి. మా వాట్సాప్ నంబర్.9133057959.