తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటి అంశమే బనకచర్ల.. మాజీ మంత్రి హరీష్ రావు.

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటి అంశమే బనకచర్ల అని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కానీ.. బనకచర్ల ప్రస్తావనే రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఆయన మాటలు, చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు, ఇతర అంశాల పరిష్కారానికే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారని ఆయన చెప్పారు. 
‘‘రాష్ట్రంలో భాజపా, తెదేపా రిమోట్‌ పాలన కొనసాగుతోంది. కమిటీ నిర్ణయాన్ని అంగీకరిస్తామని సీఎం రేవంత్‌ చెప్పడం సబబు కాదు. బనకచర్లపై కేంద్రం భేటీయే తప్పు.. సీఎం పాల్గొనడం మరో తప్పు. 4 కేంద్ర సంస్థలు తిరస్కరించిన ప్రతిపాదనపై సమావేశం ఎలా నిర్వహిస్తారు? రాష్ట్రానికి ద్రోహం చేస్తూ సీఎం మరణశాసనం రాశారు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959