కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై కేసు
బీఆర్ఎస్ క్యాడర్ను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కేసు నమోదు
నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్పై కూడా కేసు నమోదు
ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పీఎస్లో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు..
రెండ్రోజుల కిత్రం నవీన్ యాదవ్ మీడియా ముఖంగా ‘ఇంటి నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్లీ ఇల్లు సూడరు.. జూబ్లీహిల్స్ నా అడ్డా’ అంటూ వ్యాఖ్యానించారు. మరుసటి రోజే నవీన్ అనుచరులు తమ పని మొదలు పెట్టారు. గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ గూండాలతో వచ్చి ప్రచారాన్ని అడ్డుకున్నారు. ‘మళ్లీ ఇక్కడ తిరిగితే ఊరోకోం’ అంటూ ఊగిపోయారు. ఆ మరుసటి రోజు బోరబండలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై నవీన్ యాదవ్ అనుచరులు మరోసారి దాడికి పాల్పడారు..