పొలంలో పనిచేస్తుండగా తన మంగళసూత్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన మహిళ…!

దొంగ‌లు చైన్ స్నాచింగ్‌కు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు నిత్యం ఎక్క‌డో ఒక చోట వెలుగులోకి వ‌స్తున్నాయ‌నేది తెలిసిందే. పోలీసులు ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా.. ఎంత అప్ర‌మ‌త్తంగా ఉన్నా దోపిడీ దొంగ‌ల ఆగ‌డాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్‌పల్లి గ్రామంలో ఒక మహిళ, పొలంలో పనిచేస్తుండగా తన మంగళసూత్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని చితకబాదారు.
ఆ మహిళను కిష్టమ్మగా గుర్తించారు. నిందితులు ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె కేకలు వేశారు. అనంతరం ఆమె ఆ నిందితులను పట్టుకుని కొట్టారు, ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు..

ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు
నిందితులను హత్నూర మండలం ముత్యాల గ్రామానికి చెందిన వడ్డే శైలు, మీనాంపల్లికి చెందిన అరవింద్‌గా పోలీసులు గుర్తించారు.
జిన్నారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగర్జున రెడ్డి మాట్లాడుతూ.. వీరిద్దరిపై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.