తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు ఎన్నికయ్యారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఏడాది పాటు సురేష్ బాబు ఈ పదవిలో ఉండనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్గా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామ్ దాస్ ఎన్నికయ్యారు.
* ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్
* ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ,
కోశాధికారిగా ముత్యాల రామదాసు
* ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్
* రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ
* ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ బాబు
* 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31, మన ప్యానెల్ లో 17 మంది గెలుపు….
ఆదివారం (డిసెంబర్ 28) ప్రొగ్రెసివ్ ప్యానల్, మన ప్యానెళ్ల మధ్య ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. మన ప్యానల్ నుంచి చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి బడా నిర్మాతలు పోటీ పడ్డారు. ప్రొడ్యూసర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ మొత్తం నాలుగు సెక్టార్లలో 48 మంది కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి.
ప్రొగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి.సురేష్ బాబు, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఓవరాల్గా 48 మంది కార్యవర్గానికి ప్రొగ్రెసివ్ ప్యానెల్లో 31 మంది, మన ప్యానెల్లో 17 మంది గెలిచారు. తద్వారా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది. ప్రొగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో సురేష్ బాబు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు…
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959